KDP: రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం జలధార, స్వచ్ఛభారత్, రీసర్వేపై అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేసీ నిధి మీనా పాల్గొన్నారు. జలధార అమలులో డ్వామా, జలవనరుల శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ, మండల అధికారులు కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.