TG: ఆర్టీసీ నిరవధిక సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న వెల్లడించాడు. ప్రభుత్వం ముందు తమ డిమాండ్లు ఉంచుతామని పేర్కొన్నాడు. ప్రభుత్వ అధికారులతో, మంత్రులతో భేటీ తర్వాత సమ్మెపై స్పష్టత వస్తుందని తెలిపాడు. కార్మికులు సంయమనం పాటించాలని సూచించాడు. కాగా, ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.