సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదు.. మనసుకి ఒక మంచి ఔషధం. ఉదయాన్నే మీకు ఇష్టమైన పాటలతో రోజును ప్రారంభిస్తే.. అది మీలోని బద్ధకాన్ని తరిమికొట్టి, రోజంతా కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. మెదడును యాక్టివ్ చేస్తూ ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే అంటారు.. సంగీతానికి రాళ్లైనా కరుగుతాయని. మరి మీ ఉదయాన్ని మ్యూజిక్‌తో మరింత మధురంగా మార్చుకుంటారు కదా..!