BHPL: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని BHPL CPI (ML) జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ విమర్శించారు. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం ఘటన విషాదకరమని పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకరమన్నారు. సమస్యలను చర్చల ద్వారా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.