AP: లిక్కర్ కేసులో ఈడీ సోదాలు ముగిశాయి. హైదరాబాద్లో మొత్తం పదిచోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. విజయసాయిరెడ్డి ఇంటితోపాటు పలువురు ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ స్కాంలో భారీగా హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించారు.