ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం పూర్తయ్యాక వీరు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులతో కలిసి భోజనం చేశారు. తిరుమలలో భక్తులకు అందుతున్న వసతులు, అన్నదాన ఏర్పాట్లపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.