TPT: ప్రొబేషనరీ సబ్-ఇన్స్పెక్టర్లకు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు దిశానిర్దేశం చేశారు. పోలీస్ వృత్తి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యత అని, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రొబేషన్ కాలాన్ని సమర్థంగా వినియోగించుకుని స్టేషన్ డ్యూటీ, కేసు దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై పట్టు సాధించాలని తెలిపారు.