TG: ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానం తమ హృదయాలను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్‌కు ఘన నివాళులు తెలిపారు. శంకర్‌కు గౌడ్ మృతికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.