MHBD: జిల్లా విద్యాశాఖలో అక్రమాల పై విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని USFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్ డిమాండ్ చేశారు. DEO కార్యాలయంలో అన్ని విభాగాల ఫైల్స్‌ను పరిశీలించి సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఇటీవల అక్రమ డిప్యూటేషన్లు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు అనుమతుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.