RBI, ట్రాయ్ అధికారుల పేరిట ఫోన్ కాల్స్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు హెచ్చరించారు. +97,+85తో మొదలయ్యే నంబర్లతో వచ్చే కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆ నంబర్ల నుంచి వస్తే ఫోన్ ఎత్తొద్దని పేర్కొన్నారు. ఒకవేళ ఈ తరహా ఫోన్‌కాల్స్ వల్ల మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.