చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై కంకషన్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ జరుగుతుండగా MI ప్లేయర్ శాంట్నర్ గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా శార్దూల్ ఠాకుర్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే, IPL నిబంధనల ప్రకారం ఆటగాడి తల, మెడకు గాయమైనప్పుడే కంకషన్ సబ్‌స్టిట్యూట్ వర్తిస్తుందని నెట్టింట విమర్శలు వస్తున్నాయి.