BDK: బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికుల రిలే నిరాహార దీక్ష నేటితో 30వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో JAC కో కన్వీనర్ యాకుబ్ పాషా పాల్గొని మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ నాయకులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.