NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో ఇవాళ రాంకో సిమెంట్ ప్రతినిధులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాంకో వ్యవస్థాపకుడు రామస్వామి 132వ జయంతి వేడుకలను వారు ఘనంగా నిర్వహించారు. కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో వారు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.