KRNL: నగరంలోని అన్ని శానిటేషన్ విభాగాల్లో పారిశుద్ధ్య పనులు సమర్థవంతంగా చేపట్టాలని కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. ఇవాళ బుధవారపేట, సీ.క్యాంపు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఆయన సిబ్బంది హాజరు, పనితీరును పరిశీలించారు. ఉదయం 5:15కి హాజరు, 5:30కి విధుల్లోకి హాజరు కావాలని, డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.