TG: జాగృతి అధ్యక్షురాలు కవిత రేపు తన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో ఉదయం 10 గంటలకు పార్టీని ఆవిష్కరించనున్నారు. దాదాపు లక్ష మంది ఈ సభకు రానున్నారు. ప్రజా సంఘాల ప్రతినిధులు, మాజీ మావోయిస్టులు, వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు తమ పార్టీలో చేరనున్నట్లు జాగృతి ప్రతినిధులు తెలిపారు.