సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్గా శ్రీనివాసులు గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. బదిలీపై వెళ్లిన క్రాంతి కుమార్ స్థానంలో ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అధికారుల సమన్వయంతో పుట్టపర్తి అభివృద్ధికి పాటుపడతానని ఆయన స్పష్టం చేశారు.