అంతరిక్షం నుండి వచ్చాక వ్యోమగాములు చిన్న వస్తువులను పట్టుకోవడానికి ఇబ్బంది పడతారు. దీనికి కారణం మెదడు అని పరిశోధనలో తేలింది. అంతరిక్షంలోని శూన్య స్థితికి అలవాటుపడిన మెదడు, భూమిపైకి వచ్చాక వస్తువును పట్టుకోవడానికి ఎంత బలం వాడాలో అంచనా వేయలేదు. మెదడు తిరిగి భూ వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.