JGL: అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని, 252 జీవో అనుసరించి నియమ నిబంధనలు పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో నూతన మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తారన్నారు.