ADB: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామక ప్రక్రియలో భాగంగా అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్లో సమావేశమై మాట్లాడారు. జిల్లాలోని రైతాంగానికి, సహకార సంఘాలకు వెన్నెముకగా ఉన్న DCCB సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో CEO పాత్ర కీలకమని అన్నారు.