MDCL: బోడుప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంటమాలజీ చర్యలు చేపడుతూ దోమల నివారణపై అవగాహన కల్పించారు. అసిస్టెంట్ ఎంటమాలజిస్టు రాంబాబు ప్రజలకు సూచనలు చేస్తూ, పరిసరాలు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఇంటి లోపల బయట పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని చెప్పారు.