VZM: జామి మండలం సిరికిపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మామిడి తోటలో చెట్ల చుట్టూ అర్ధచంద్రాకారంలో ట్రెంచ్‌లు ఏర్పాటు చేసి నీటి నిల్వకు అనుకూలంగా రూపొందించిన విధానాన్ని పరిశీలించారు. అలాగే ఈ ట్రెంచ్‌లలో ఆరు రకాల సీడ్ బాల్స్‌ను నాటిన విధానాన్ని పరిశీలించి అభినందించారు.