WGL: వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రిలో 7 పడకల డయాలసిస్ కేంద్రం మంజూరైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు. కిడ్నీ రోగులకు స్థానికంగా చికిత్స అందుబాటులోకి రావడంతో దూర ప్రయాణం అవసరం తగ్గి సమయం, ఖర్చు ఆదా అవుతుందని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.