JN: రఘునాథపల్లి మండలం వెల్ధి గ్రామానికి వెళ్లే రహదారి దయనీయ స్థితికి చేరింది. పెద్దపెద్ద గుంతలు, పైకి వచ్చిన కంకరతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో వాహనాదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితేనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను కోరారు.