కర్నూల్ నుంచి కొత్తకోట విద్యార్థి బస్సు సర్వీసును మే 10 వరకు కొనసాగించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు ఇంఛార్జ్ అనంతరత్నం మాదిగ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులతో కలిసి ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు గారికి వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల సమస్యను గుర్తించిన బస్సు కొనసాగిస్తామని ఆర్ఎం హామీ ఇచ్చారు.