WGL: నర్సంపేట RTC కార్మికుడు శంకర్ గౌడ్ మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ వైఖరి కారణంగా జరిగిన ఘటన అని విమర్శించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. 1 కోటి పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.