NLG: జిల్లాలో ఆర్టీసి కార్మికుల సమ్మె ఇవాళ మూడో రోజు నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి, సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.