TG: వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించిన బండి సంజయ్.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అయితే శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మృతదేహాన్ని తరలిస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.