KMM: తిరుమలాయపాలెం మండలం మేకల తండా స్టేజి వద్ద గుగులోతు గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రన్ని పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ ఛైర్మన్ చావా శివరామకృష్ణ ప్రారంభించారు. వారితోపాటు మండల ఎస్సై కూచిపూడి జగదీష్ పాల్గొన్నారు. పెరుగుతున్న ఎండల అదృష్ట ప్రజల సౌకర్యార్థం ఈ చలివేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.