GDWL: ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మెకు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నివాళులర్పించి, కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తన తరఫున లక్ష రూపాయల సాయం ప్రకటించాలని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.