NRML: దిలావర్పూర్ సమీపంలోని పోచమ్మ చెరువు వద్ద ఉపాధిహామీ పనిస్థలంలో శుక్రవారం వడదెబ్బపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజేశ్వర్ కార్మికులకు ఎండ తీవ్రత నుండి రక్షణ చర్యలు వివరించారు. తలపై రుమాలు లేదా టోపీ ధరించడం, లేత రంగు కాటన్ దుస్తులు వేసుకోవడం, ఎక్కువగా నీరు తాగడం వంటి సూచనలు చేశారు.