SRCL: తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చలివేంద్రాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. అనంతరం సర్పంచ్ గదగోని సాగర్ మాట్లాడుతూ.. రైతుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, రైతులు, తదితరులు పాల్గొన్నారు.