ADB: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ హైదరాబాదులో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పండించిన శనగ, జొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరను అందించాలని విన్నవించగా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.