ATP: పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామం నుంచి వజ్రగిరి లక్ష్మీనరసింహ స్వామి కొండ వరకు రూ.2.50 కోట్లతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేశారు. కొండపై వెలసిన స్వామి వారిని దర్శించుకునే భక్తులకు ఈ రోడ్డు ఎంతో సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.