తండ్రి కూలీ, ఇంట్లో కనీస వసతులు లేవు. ఒకప్పుడు విరిగిన హాకీ స్టిక్‌ను గుడ్డతో కట్టుకుని ఆడిన నౌషీన్ నాజ్.. ఇవాళ దేశం గర్వించేలా ఎదుగుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ 15 ఏళ్ల బాలిక, జాతీయ స్థాయిలో 9 గోల్స్ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్’ అవార్డు గెలుచుకుంది. పేదరికాన్ని, విమర్శలను దాటుకుంటూ జపాన్‌లో జరిగే అండర్-18 ఆసియా కప్‌కు ఎంపికయ్యే దిశగా దూసుకుపోతోంది.