ప్రకాశం: తండ్రితో గొడవపడి మద్యం మత్తులో ఓ యువకుడు ఫినాయిల్ త్రాగిన సంఘటన పామూరు పట్టణంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. అంకాలమ్మ వీధికి చెందిన వేముల బాలు బెంగళూరులో మిల్లర్ పనిచేస్తుంటాడు. నెల క్రితం బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు. తండ్రితో ఫోన్లో గొడవపడి మద్యం మత్తులో గురువారం రాత్రి ఫినాయిల్ తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు.