TG: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ మృతదేహం తన అల్లుడి స్వగ్రామానికి చేరుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక అంబులెన్స్‌లో అధికారులు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.