NLG: పానగల్లు ఉదయ సముద్రం రిజర్వాయర్లో నిషేధాజ్ఞలు బేఖాతరు అవుతున్నాయి. తాగునీరు కలుషితం కాకుండా చేపల వేట, ఈతపై ఆంక్షలు ఉన్నా ఫలితం ఉండటం లేదు. మత్స్యకారులు యథేచ్ఛగా వేట సాగిస్తుండగా, జనం ప్రమాదకరంగా ఈతకు దిగుతున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 0.9 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నందున, ఎవరూ లోపలికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.