ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, సీఐ రాజేష్ కుమార్ సూచనలతో పొదిలి–మార్కాపురం అడ్డరోడ్డులో ప్రమాదకర మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేశారు. ఎస్సై సూరెడ్డి రాజేష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్యతో మలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించడంతో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఇవి డ్రైవర్లకు ఉపయోగపడుతాయన్నారు.