ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో గురువారం శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకుంటూ మాట్లాడారు. సమాజ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.