KRNL: ఇంటర్ ఫలితాల్లో 1000కు గాను 988 మార్కులు సాధించిన పూర్వ విద్యార్థిని ఎస్. దీపికను పెద్దకడబూరులోని ఉన్నత పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఆదోని డిప్యూటీ డీఈవో రాజేంద్రప్రసాద్ శాలువా కప్పి మెడల్, మెమొంటో అందజేశారు. చిన్నతుంబళం గ్రామానికి చెందిన దీపిక బనవాసి ఏపీఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి ఈ ప్రతిభ సాధించింది.