కోనసీమ: ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పొందవచ్చని, సబ్సిడీ కూడా లభిస్తుందని కొత్తపేటకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం తెలిపారు. విద్యుత్తు పంపిణీ కేంద్రాలు, మున్సిపల్, సచివాలయ అధికారుల ద్వారా ఈ పథకం పొందవచ్చన్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలన్నారు.