నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఉన్న బడుగు బలహీన వర్గాల కాలనీలలోని ప్రజలకు, పాఠశాలల విద్యార్థులకు శుద్ధి చేసిన వాటర్ అందించేందుకు కృషి చేస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. గురువారం మిడ్తూరు మండలం తలముడిపి గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన మినరల్ వాటర్ ఫ్లాంట్‌ను ఆమె ప్రారంభించారు. తాగునీరు వృధా చేయవద్దని ప్రజలను కోరారు.