PLD: మోడల్ స్కూల్ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో ఈపూరు విద్యార్థులు సత్తా చాటారు. మల్లెల వినయ్ 100కు 93 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. టీ. ఆరాధ్య 91 మార్కులతో ద్వితీయ స్థానం సాధించింది. విద్యార్థుల పట్టుదలతో పాటు ఉపాధ్యాయుల బోధన కీలకమని తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా విజయానికి కారణమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.