ప్రకాశం: పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన సందర్భంగా గొట్టిపాటి లక్ష్మికి దళిత సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె క్యాంప్ కార్యాలయంలో లక్ష్మి దంపతులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పిచ్చయ్య, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.