SDPT: మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు కొనుగోళ్లు జరగకపోవడంపై BRS నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని యార్డును సందర్శించిన మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రేపటిలోగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.