VSP: గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం, ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఏప్రిల్ 28న శంకుస్థాపనను అడ్డుకుంటామని సీపీఎం నేత లోకనాథం హెచ్చరించారు. తర్లువాడ రైతులకు న్యాయం చేయాలంటూ శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అదానీ భూ కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.