VKB: మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా చిన్ననందిగామ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకుంది. పాఠశాలకు రంగులు వేసి సకల సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బడిని తీర్చిదిద్దిన సీఎంకు, సర్పంచ్ దత్తాత్రేయరావుకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.