KRNL: ఆస్పరి సీఐగా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ నాయక్ శుక్రవారం ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు న్యాయం చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకారం అందించాలని వైకుంఠం జ్యోతి సూచించారు.