TG: మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి నివాళులర్పించేందుకు ఆయన నర్సంపేట బయలుదేరగా, హన్మకొండలోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఆయనను గృహ నిర్బంధం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విపక్ష నేతలను అడ్డుకోవడంపై ఈ సందర్భంగా ఎర్రబెల్లి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.