NRML: జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం భైంసాలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి సమస్యపై తక్షణ స్పందన ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు వెంటనే సహాయం అందించాలని ఆదేశించారు. కుటుంబ వివాదాల్లో ‘షీ టీం’ కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం చూపగా, పెండింగ్ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.